కొత్త జంట నాగచైతన్య,సమంతలకు శుభాకాంక్షల వెల్లువ

వెండితెర మీద హిట్ పెయిర్ అనిపించుకున్న నాగచైతన్య, సమంతలు నిజ జీవితంలోనూ ఒక్కటయ్యారు. కొద్ది రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన వీరి పెళ్లి వేడుక చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం తెలుగు సాంప్రదాయం ప్రకారం ఒక్కటైన ఈ జంట, శనివారం క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతిలో మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే శుక్రవారం జరిగిన పెళ్లి వేడుకకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానుల కోసం తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు […]

సెల్ఫీ పిచ్చి – ఫ్రెండ్‌ ప్రాణం పోతున్నా… పట్టించుకోలేదు !

సెల్ఫీల మోజులో పడి, జీవితం విలువను మర్చిపోతున్నారు యువత. ఓ వైపు ఫ్రెండ్‌ ప్రాణం పోతున్నా.. పట్టించుకోకుండా గ్రూఫ్‌ సెల్ఫీ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. జ్ఞాపకార్థం కోసం తీసుకునే ఈ సెల్ఫీ ఫోటోలే, వారికి ఆఖరి క్షణాలుగా మిగులుస్తున్నాయి. ఇదే రకమైన ఓ విషాదకర సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. జయనగర్‌లోని నేషనల్‌ కాలేజీ స్టూడెంట్‌ విశ్వాస్‌ చెరువులో మునిగిపోయాడు. అదే సమయంలో తన స్నేహితులందరూ కలిసి సెల్ఫీ దిగే మోజులో పడిపోయారు. తన ఫ్రెండ్‌ చెరువులో మునిగిపోతున్న […]

మైనర్ బాలికలను దుబాయ్‌కు అమ్మేసే ముఠా అరెస్ట్‌

పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్‌ షేక్‌లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్‌కు అమ్మేసే గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్‌లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో ఉన్నాడని చెప్పారు. 38 మంది బ్రోకర్లను […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ పై క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వివాదాస్పద పోస్ట్ లు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజాగా సినిమా నిర్మాత గురించి వస్తున్న వార్తలను ఖండించారు. కొద్ది రోజులుగా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి నిర్మాత అన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన […]

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌… ఫీచర్లు అదుర్స్‌

నోకియా అభిమానులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న తొలి హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌భారత్‌లోకి వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను న్యూఢిల్లీ వేదికగా నేడు(మంగళవారం) భారత్‌లోకి లాంచ్‌ చేస్తున్నట్టు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. టాప్‌-ఎండ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ, వెనుకవైపు రెండు కెమెరాల సెటప్‌, ప్రీమియం యూనిబాడీ డిజైన్‌, బోతీస్‌ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 14 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో […]

వైఎస్‌ జగన్ పాదయాత్ర డేట్ చేంజ్…కారణం ఏంటో తెలుసా ?

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్టోబరు 27వ తేదీ నుంచి తలపెట్టిన పాదయాత్రలో చిన్నపాటి మార్పులు జరిగాయి. నవంబరు రెండో తేదీ నుంచి దీనిని ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అక్టోబరు 27 మంచి రోజు కాదని జ్యోతిష్కులు చెప్పటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 180 రోజులు అంటే ఆరు నెలల పాటు ఏకబిగిన నిర్వహించాలనుకున్న తన యాత్ర మంచి చెడుల గురించి జగన్‌ ఇటీవల పలువురు జ్యోతిష్కులను సంప్రదించారు.నేటి రోజుల్లో చాలామంది […]

జగన్ కు చేరువవుతున్న కీలక నేతలు… వైపీలోకి మరో ఇద్దరు నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నాయకులు వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి సోమవారం లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రమూర్తికి పార్టీ కండువా వేసి జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ, కాకినాడ పార్లమెంటరీ […]

మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌కు రంగం సిద్ధం

ఇప్పటికే క్రికెటర్లు అజహరుద్దీన్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ జీవితాధారంగా బయోపిక్‌లు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ జీవితం కూడా సినిమాగా రాబోతోంది.అలాగే తాజాగా మరో మహిళా క్రికెటర్‌ బయోపిక్‌కు రంగం సిద్ధమౌతోంది. టీమీండియా కెప్టెన్‌ మిథాలీరాజ్‌ సక్సెస్‌ జర్నీని సినిమాగా మలిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మేరకు హక్కులు కొనుగోలు చేసి మిథాలీతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు ముంబై మిర్రర్‌ ఓ కథనం ప్రచురించింది. వన్డేలో అత్యధిక పరుగులు చేసిన […]

పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ?

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వచ్చే ఏడాది హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల బాలకృష్ణ ఒక సందర్భంలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది మోక్షజ్ఞ మూవీని లాంచ్ చేయనున్నట్టు చెప్పారు. ఆ సినిమా బాధ్యతను ఆయన పూరీ జగన్నాథ్ కి అప్పగించే ఆలోచనలో ఉన్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన తనయుడితో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో వున్నాడు. ఆ తరువాత బాలకృష్ణ మూవీని చేయనున్నట్టు చెప్పాడు. ఆ ప్రాజెక్టు తరువాత ఆయన బాలకృష్ణ […]

చంద్రబాబుకి బిగ్ షాక్…టీడీపీకి ఇద్దరు జెడ్పీటీసీలు,17మంది ఎంపీటీసీలు గుడ్ బై

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్‌ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్‌ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారిపోయాయి.దీనితో చింతలపూడి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు క్లయిమాక్స్‌కు చేరాయి. ఎమ్మెల్యే పీతల సుజాత వైఖరిని నిరసిస్తూ ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, 17 […]